saidines12/telugu-news-headline-generation
3B • Updated • 6
story_id int64 2.44M 2.54M | headline stringlengths 1 363 | article stringlengths 35 14.6k |
|---|---|---|
2,481,002 | బుమ్రాకు విశ్రాంతి! | కుల్దీప్–అక్షర్ మధ్య పోటీ27 నుంచి బంగ్లాతో రెండో టెస్టున్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023–25 అంచెలో భాగంగా టీమిండియా ఆడే పది టెస్టుల్లో మొదటిదాన్ని ఘన విజయంతో ముగించింది. బంగ్లాదేశ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 280 పరుగుల తేడాతో నెగ్గి డబ్ల్యూటీసీ టేబుల్లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలపర్చుకుంది. ఇక ... |
2,481,003 | ఎస్ఎంఈ ఐపీఓల్లో మాయ | మర్చంట్ బ్యాంకర్లే సూత్రదారులు... నిగ్గు తేల్చిన సెబీ దర్యాప్తు!న్యూఢిల్లీ: ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓ) భారీగా సబ్స్క్రిప్షన్ కావడం వెనక పెద్ద దందానే నడుస్తోంది. కొన్ని సంస్థలు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్ల (హెచ్ఎన్ఐ) సాయంతో మర్చంట్ బ్యాంకర్లే ఈ దందా నడిపిస్తున్నట్టు సెబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఈ సంస్థలు, హై నెట్... |
2,481,004 | సెన్సెక్స్ @ 85,000 | ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్లో సరికొత్త గరిష్ఠాలకు ఎగబాకాయి. సెన్సెక్స్ తొలిసారిగా 85,000, నిఫ్టీ 26,000 మైలురాయిని తాకాయి. కానీ, ఇన్వెస్టర్లు ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ ఒక దశలో... |
2,481,006 | దీప్తికి రూ. కోటి అందజేసిన సీఎం | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో దీప్తికి ఆర్థిక సహాయంతోపాటు కోచ్ రమేష్కు రూ. 10 లక్షల చెక్కును సీఎం అందించారు. దీప్తికి గ్రూప్–2 ఉద్యోగం, ఆర్థిక సహాయం, వరంగల్లో 50... |
2,481,007 | విస్తరణ బాటలో రామ్రాజ్ కాటన్ | వచ్చే రెండేళ్లలో కొత్తగా 200 స్టోర్లుహైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారతీయ సాంప్రదాయ, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తున్న రామ్రాజ్ కాటన్ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం కంపెనీ దక్షిణ భారత్లో 300కు పైగా షోరూమ్స్ను నిర్వహిస్తోంది. కాగా విస్తరణలో భాగంగ... |
2,480,988 | ఇరానీ కప్నకు జురెల్, సర్ఫరాజ్ | న్యూఢిల్లీ: వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్తోపాటు పేసర్ యశ్ దయాళ్ను భారత టెస్ట్ టీమ్ నుంచి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవాళీ టోర్నీ ఇరానీ కప్ కోసం రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో మంగళవారం ప్రకటించిన రెస్టాఫ్ ఇండియా జట్టులో జురెల్, యశ్కు చోటు కల్పించగా.. ముంబై టీమ్కు సర్ఫరాజ్ను ఎ... |
2,480,989 | ఒక్క ఫుట్బాల్ స్టేడియంతో ఏటా రూ. 81 వేల కోట్లా! | లండన్: ఒక్క ఫుట్బాల్ స్టేడియాన్ని నిర్మిస్తే.. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి రూ. 81,733 కోట్ల తోడ్పా టు లభిస్తుందంటూ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ చేసిన అధ్యయనం ఎంతో ఆసక్తికరంగా మారింది. తాజాగా మాం చెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్నకు చెందిన ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం, చుట్టుపక్కల ఆధునికీకరణ వ్యయ భారాలకు సంబంధించిన నివేదికన... |
2,480,990 | అందరూ మహిళలే | దుబాయ్: టీ20 ఉమెన్ వరల్డ్కప్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన ప్యానెల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. మొత్తం 13 మంది మ్యాచ్ అఫీషియల్స్లో 10 మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రెఫరీలు ఉన్నారు. భారత్నుంచి తెలుగు మహిళ జీఎస్ లక్ష్మి మ్యాచ్ రెఫరీగా, వ్రింద రాఠీ అంపైర్గా వ్యవహరించనున్నారు. వచ్చే నెల 3 నుంచి యూఏఈ వేదికగా పొట్టికప్ జరగ... |
2,480,991 | బంగారం భగ ధగ! | అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ న్యూయార్క్: ఫెడ్ రేట్ల తగ్గింపుతో పాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంంలో బులియన్ ధరలు క్రమంగా కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర మరో 18 డాలర్ల మేర పెరిగి 2,646 డాలర్లకు చేరుకుంది. ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధర సైతం అర శాతానికి పైగా పెరిగి 2,... |
2,480,998 | హైదరాబాద్లో ఇంటెల్ ఏఐ, గేమింగ్ జోన్ | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఇంటెల్ హైదరాబాద్లో తొలి ఏఐ, గేమింగ్ జోన్ను ప్రారంభించింది. విశాల్ పెరిఫెరల్స్ భాగస్వామ్యంతో ఈ జోన్ను ప్రారంభించినట్లు ఇంటెల్ డైరెక్టర్, హెడ్ సిస్టమ్స్ రాహుల్ మల్హోత్రా, సీనియర్ మేనేజర్ అరుణ్ రాఘవన్ తెలిపారు. విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ఈ జోన్ను డిజైన్ చేసినట్లు... |
2,480,992 | పంత్.. ఓ అద్భుతం: అక్రమ్ | కరాచీ: ఘోర ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఓ అద్భుతమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ కొనియాడాడు. ‘రోడ్డు ప్రమాదం తర్వాత ఎవరికైనా కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఇక ఆటగాడికైతే మరింత కష్టంగా ఉంటుంది. కానీ పంత్ అలా కాదు. నిజంగా తను మిరాకిల్ కిడ్. అతడిని యువ... |
2,480,993 | ‘బాక్సింగ్ డే’ టిక్కెట్లకు ఫుల్ గిరాకీ | మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో ఈ ఏడాది చివర్లో జరిగే బాక్సింగ్ డే టెస్టు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా డిసెంబరు 26న మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఈ నాలుగో టెస్టు ఆరంభం కానుంది. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నట్టు ... |
2,480,994 | రెండో టెస్టుపై కాన్పూర్లో నిరసన | కాన్పూర్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆ దేశ క్రికెట్ జట్టుతో టెస్టు సిరీస్ను రద్దు చేయాలని పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా కాన్పూర్లో ఈనెల 27నుంచి జరిగే రెండో టెస్టును అడ్డుకునేందుకు సోమవారం అఖిలేష్ భారతీయ హిందూ మహాసభ కార్యకర్తలు స్టేడియానికి వెళ్లే రోడ్డుపై హోమాన్ని నిర్వహించారు.... |
2,480,995 | విజేత జీవన్ జోడీ | న్యూఢిల్లీ: భారత టెన్నిస్ జోడీ జీవన్ నెడుంజెరియన్, విజయ్సుందర్ ప్రశాంత్ చైనాలో జరిగిన హాంగ్జౌ ఓపెన్లో డబుల్స్ విజేతగా నిలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్–విజయ్ ద్వయం 4–6, 7–6(5), 10–7తో జర్మనీ జంట కాన్స్టాంటిన్–హెండ్రిక్ను ఓడించి ఏటీపీ టైటిల్ను అందుకుంది. కాగా, చైనాలోనే జరిగిన చెంగ్డూ ఓపెన్ల... |
2,480,987 | ఉత్పత్తి, అమ్మకాలూ పెంచుకున్నాం: ఎన్ఎండీసీ | న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరాని (2023–24)కి సంబంధించి తమ కంపెనీ మంచి పనితీరు కనబరిచినట్టు ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ చెప్పారు. కంపెనీ 66వ ఏజీఎంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఎన్ఎండీసీ 4.5 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసి, 4.44 కోట్ల టన్నుల ఖనిజాన్ని విక్రయించినట్టు తెలిపారు... |
2,480,890 | మూసీ నిర్వాసితులకు | మూసీ రివర్ బెడ్లోని 1600 ఇళ్ల తొలగింపు షురూఆ తర్వాత బఫర్ జోన్లోని నిర్మాణాలు కూడా..నిర్వాసిత కుటుంబాలు 16 వేలు ఉంటాయని అంచనాఅర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపుబుధవారం నుంచి ఇంటింటికీఅధికారుల బృందంఔటర్ లోపల చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ నిర్ధారణశంషాబాద్ నుంచి ఫ్యూచ ర్ సిటీకి మెట్రోపై రూట్ మ్యాప్ దసరా వరకు మెట్రో వ... |
2,480,869 | రుణమాఫీ! | రూ.4250 కోట్లు అవసరమని అంచనా.. స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగ్నెలాఖరుకల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దసరాలోపు నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. రేషన్ ... |
2,480,870 | మిల్లర్ ఆస్తుల జప్తు | కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగివ్వకపోవడమే కారణంరూ. 5.67 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. జనగామ జిల్లాలో ఘటనక్రిమినల్ కేసు, రెవెన్యూ రికవరీ యాక్ట్కు కలెక్టర్ ఆదేశంమహబూబాబాద్ జిల్లాలో ఓ మిల్లుపై టాస్క్ఫోర్స్ దాడులురూ.9.56 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తింపుదేవరుప్పుల, గూడూరు, సెప్టెంబరు 24: కస్టమ్ మిల్లింగ్ క... |
2,480,871 | రూ.159 కోట్లు | సర్కారుకు చెప్పకుండానే మహదేవ్పూర్ ఈఈ–1 తిరుపతిరావు ఇచ్చేశారుసదరు కంపెనీ నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి సమాచారం లేదువరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయాంసెకనుకు 4.25 మీటర్లు వస్తుందనుకుంటే 12–14 మీటర్లుజస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఇంజనీర్ల వెల్లడినేడు ఇరిగేషన్ కార్పొరేషన్ అధికారుల క్రాస్ ఎగ్జామినేష... |
2,480,872 | నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు | పిడుగులు పడి నలుగురి మృతి పలు జిల్లాల్లో దంచికొట్టిన వానబంగాళాఖాతంలో అల్పపీడనంఈ నెల 27 వరకు ఎల్లో అలర్ట్ (ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల... |
2,480,873 | 15 లక్షల రేషన్కార్డుల రద్దు? | వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం!వచ్చేనెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల స్వీకరణసిటిజన్ 360 ద్వారా అర్హుల గుర్తింపుఆధార్తో అనుసంధానమై ఉన్న సాఫ్ట్వేర్వీటి ఆధారంగానే కొత్త రేషన్కార్డుల జారీ |
2,480,874 | రేవంత్ కుటుంబం దోపిడీ | కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యలేదనే కక్షతో పేదల ఇళ్ల కూల్చివేతకేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారుఅరికెపూడికి కండువా కప్పిన సన్నాసెవరు? ఏపీలో బాబు.. వారంలోనే పింఛన్ల పెంపుఇక్కడ పది నెలలైనా రేవంత్కు చేతకాలే వైద్య ప్రవేశాలపై మొద్దునిద్ర వీడేదెప్పుడు?రాష్ట్ర సర్కారుపై కేటీఆర్ ధ్వజం |
2,480,875 | రేవంత్రెడ్డి.. కోర్టుకు రండి! | ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టుహైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు ఈడీ కేసులో నిందితులందరూ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ కేసు విచారణకు జెరూసలేం మత్తయ్య మినహా మిగిలిన వారెవరూ మిగతా 11వ పేజీలో... |
2,480,876 | ఎన్నారై కోటా.. ఓ మోసం | డబ్బులు దండుకునే ఎత్తుగడ: సుప్రీంకోర్టువైద్యకళాశాలల్లో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేతన్యూఢిల్లీ, సెప్టెంబరు 24: విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్నారై కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది పూర్తిగా మోసమని, దీనికి తక్షణమే ముగింపు పలక... |
2,480,877 | కర్ణాటక సీఎంకు షాక్ | ముడా స్కాంలో సిద్దరామయ్య ప్రాసిక్యూషన్కు రాష్ట్ర హైకోర్టు ఓకేగవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టివేతసిద్దూ రాజీనామాకు బీజేపీ డిమాండ్నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంహైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్? |
2,480,879 | వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం | ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదలరేపటి నుంచి వెబ్ ఆప్షన్లు |
2,480,880 | రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా | చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదంరాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలంజాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా కృష్ణయ్య? |
2,480,881 | ఇరిగేషన్ శాఖలోకి 677 మంది ఏఈఈలు | 31 మంది ఐఐటీ, 83 మంది ఎన్ఐటీ పట్టభద్రులురేపు నియామక పత్రాలివ్వనున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్1800మంది లష్కర్ల నియామకంపైనా ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి |
2,480,878 | దసరాకు మంత్రివర్గ విస్తరణ? | ఏఐసీసీ నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్న ఖర్గేనలుగురి పేర్లు ఇప్పటికే ఖరారు మరో ఇద్దరి పేర్లపై కుదరని ఏకాభిప్రాయంసీఎం రేవంత్ వెళ్లి చర్చించాక తుది జాబితా |
2,480,882 | ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు | మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే |
2,480,883 | శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేసేస్తున్నారు! | ఇన్ఫ్లో అంతంతమాత్రమేపోటాపోటీగా తెలంగాణ, ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి3 వారాల్లో 52.61 టీఎంసీల తరుగుదల |
2,480,884 | సీఎంఆర్ చేయలేం | సర్కార్కు నల్లగొండ రైస్ మిల్లర్ల లేఖ |
2,480,866 | కశ్మీరంలో ఎన్నికల సమరం | పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది! ఈ దశలో మొత్తం 26 నియోజకవర్గాల నుంచి 239 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు! 25.78 లక్షల మంది ఓటర్లు బుధవారం వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల నిమిత్తం భా... |
2,480,867 | కర్ణాటక సీఎంకు హైకోర్టు షాక్ | ● గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్ కొట్టివేత● సిద్దూ రాజీనామాకు బీజేపీ డిమాండ్● నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీబెంగళూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మైసూర్ పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర... |
2,480,854 | ఎన్నారై కోటా.. ఓ మోసం | (మొదటి పేజీ తరువాయి)ఇచ్చేవారికి దొడ్డి దారిన ప్రవేశాలు కల్పించడానికి ఇది అవకాశం ఇస్తోందని మౌఖికంగా వ్యాఖ్యానించింది. చట్టవ్యతిరేకమైన ఈ పద్ధతిని సమర్థించలేమని తెలిపింది. వైద్య కళాశాలల ప్రవేశాల్లో ఎన్నారై కోటాపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను కొట్టివేస్తూ పంజాబ్–హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఎన్ఆర... |
2,480,855 | లెబనాన్పై గాజా తరహా దాడులు! | ● ఇజ్రాయెల్ దాడుల్లో 15 మంది దాకా హిజ్బుల్లా టాప్ కమాండర్ల మృతి.. 558కి పెరిగిన మొత్తం మరణాలుటెల్అవీవ్/బీరుట్, సెప్టెంబరు 24: మూడు వేలకు పైగా పేజర్ బాంబుల బీభత్సం.. ఆ మర్నాడే వందల సంఖ్యలో వాకీటాకీల పేలుళ్లు.. ఈ దారుణాలు జరిగి వారం గడవక ముందే.. వందల క్షిపణులతో ముప్పేట దాడులు..! వెరసి లెబనాన్లో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా ... |
2,480,856 | ట్రాములకు టాటా | సేవలను నిలిపివేయాలని నిర్ణయించిన బెంగాల్ సర్కారుకోల్కతా, సెప్టెంబరు 24: కోల్కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ‘ట్రాము’ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా వాహనాలతో పోలిస్తే ట్రాములు నెమ్మదిగా నడవడంతో రోడ్లపై రద్దీ పెరుగుతోందని, ప్రజలు వేగవంతమైన రవాణా సదుపాయాలు కోరుకుంటున్న ఈ సమయంలో వాటిని ఇంకా ... |
2,480,857 | హరియాణా యువత ఎందుకు ‘డంకీ’లవుతున్నారు? | ● బీజేపీకి రాహుల్గాంధీ ప్రశ్నన్యూఢిల్లీ, సెప్టెంబరు 24: దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేసి వారికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని రాహుల్గాంధీ ఆరోపించారు. ఫలితంగా హరియాణా వంటి రాష్ట్రాల్లో యువత విదేశాల బాటపట్టి తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇటీవల ఆయన అమెరికా వెళ్లినప్పుడు హరియాణా నుంచి అమెరికా వలస వెళ్లినవా... |
2,480,858 | చైనా, భారత్ మధ్య నలిగిపోం | ● శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే వ్యాఖ్య● ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణంకొలంబో, సెప్టెంబరు 24: చైనా, భారత్ మధ్య నలిగిపోదలుచుకోలేదని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే అన్నారు. భౌగోళిక రాజకీయ వైరాల్లోకి శ్రీలంకను లాగకుండా తటస్థ విదేశాంగ విధానం అవలంబిస్తామని ఓ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తమ నేషనల్ పీ... |
2,480,859 | ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు! | ● అందుకే గోహత్యను నిషేధించటం లేదు ● హిందువుల పవిత్రతను దెబ్బ తీయడానికే తిరుపతి లడ్డూ కల్తీ: అవిముక్తేశ్వరానంద్ లక్నో, సెప్టెంబరు 24: నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి మరోసారి సం... |
2,480,853 | వరుస రైలు ప్రమాదాల వేళ ‘రైల్ రక్షా దళ్’ | న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే తొలిసారి ‘రైల్ రక్షా దళ్’ను ఏర్పాటు చేసింది. ప్రమాద సమయాల్లో సత్వరం ఘటనా స్థలికి చేరుకుని సహాయం అందించే సామర్థ్యం ఈ రైల్ రక్షా దళ్కు ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా వాయువ్య రైల... |
2,480,863 | ఆరేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచార యత్నం | ● ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్యఅహ్మదాబాద్, సెప్టెంబరు 24: ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతోంది. తాను చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన కారులోనే ప్రతి రోజూ బడికి వెళ్లేది. 55 ఏళ్ల వయసు ఉన్న ఆ ప్రిన్సిపాల్ గురువారం చిన్నారిని బడికి తీసుకువెళ్తూ కారులోనే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు... |
2,480,850 | 633 ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టుల నోటిఫికేషన్ | ● తుది గడువు 21.. నవంబరు 30న రాత పరీక్ష● కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వారికి వెయిటేజ్ ● నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ బోర్డు ● 15 రోజుల్లో 3 నోటిఫికేషన్లు.. 3967 పోస్టుల భర్తీ హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైద్యఆరోగ్యశాఖ నుంచి 15 రోజుల వ్యవధిలో మూడో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 633... |
2,480,851 | రూ.159 కోట్లు | (మొదటి పేజీ తరువాయి)సంబంధించి నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీల సొమ్మును ఎవరు విడుదల చేశారు? దానికి ముందు అండర్ టేకింగ్ ఏమైనా తీసుకున్నారా!?’’ అని ఈఎన్సీ (జనరల్) కార్యాలయంలోని డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్ను కమిషన్ ప్రశ్నించింది. దీనికి ఆయన జవాబిస్తూ.. ‘‘2020 అక్టోబరు 13వ తేదీన రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల... |
2,480,852 | నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు | (మొదటి పేజీ తరువాయి)అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు దంచికొట్టాయి. వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 9.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే, రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో 8.95, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 8.53, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంల... |
2,480,845 | విద్యుత్తు నియంత్రణ మండలి నియామకాల్లో పారదర్శకత ఏదీ? | ● వెబ్సైట్లో వివరాలేవీ? : అభ్యర్థుల ఆరోపణలుహైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీ ఈఆర్సీ) నియామకాల్లో పారదర్శకత లోపించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈఆర్సీలో నియామకాల కోసం గత మార్చిలో నోటిఫికేషన్ వెలువడింది. 11 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు అర్హులు చాలా మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్య... |
2,480,846 | నేడు పాడి రైతులకు రూ. 60 కోట్లు విడుదల | హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పాడి రైతులకు బకాయిలున్న పాల బిల్లుల్లో రూ. 60 కోట్లు బుధవారం విడుదల చేయనున్నట్లు విజయ డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తెలిపారు. ఈ చెల్లింపులతో ఆగస్టు 15 నాటికి రైతులకున్న బకాయిలు పూర్తవుతాయని తెలిపారు. ఇక నెల రోజుల బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. |
2,481,400 | భోజనం బాగుందా.. | ●జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు సంక్షేమ హాస్టళ్ల బాటపడుతున్నారు. విద్యార్థులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా, ఎక్కడ చదువుకుంటున్నారు, మీకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి.. అనే విషయాలను ఆరా తీస్తున్నారు. విద్యార్థుల సమస... |
2,481,401 | రెమ్మలు.. | వేలుభార్య ప్యాకింగ్, భర్త, కొడుకులు విక్రయం• గంజాయి స్మగ్లింగ్లో ఆరితేరిన కుటుంబం• ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా దందా• రెండేళ్లుగా ఇదే వ్యాపారంలో..• హెచ్న్యూకు చిక్కిన అనంతయ్య ఫ్యామిలీ• పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): పార్సిల్ చూస్తే.. టిఫిన్ సెంటర్లో దోశ మాదిరిలా ... |
2,481,402 | నైపుణ్య శిక్షణ తప్పనిసరి | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యలో విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పాల్సిన అవసరం ఉందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. సత్వరమే స్పోకెన్ ఇంగ్లీష్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ లాంటి కనీస నైపుణ్యాల శిక్షణను ప్రారంభించాల్సిన అవసరముందన్నారు. అప్పుడే తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతా... |
2,481,403 | దక్షిణ కొరియాకు జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు | హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మూసీనదికి పూర్వ వైభవం తీసుకువస్తూ.. పర్యాటక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరింత ముందుకెళ్తోంది. నది అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధులనూ భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూసీని ఎలా అభివృద్ధి చేయాలి? తద్వారా క... |
2,481,389 | వర్షం పడితే బయటకు రావొద్దు | • పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలి• వరద నీళ్లున్న ప్రాంతాలకు వెళ్లకండి: ఆమ్రపాలిహైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు పడినప్పుడు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట నగరవాసులను కోరారు. పిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి రాకుండా కుటుంబసభ్యులు చూసుకోవాలన్నారు.... |
2,481,390 | టైమ్ అంటే టైమే.. | • సమయానికి దుకాణాలను మూసేయాల్సిందే• రూల్స్ అతిక్రమిస్తే వ్యాపారులపై చట్ట ప్రకారం చర్యలు • సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిఽధిలో దుకాణాలు, ఫుడ్ కోర్టులు, వ్యాపార సముదాయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్షాపులు.. కచ్చితమైన సమయప... |
2,481,392 | ఉస్మానియా.. ఐపీ హౌస్ఫుల్ | • రోగులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రి ఐపీ విభాగం • పడకలు 1168.. చికిత్స పొందుతున్నది 1800 మంది • తీవ్రంగా వేధిస్తున్న డాక్టర్లు, నర్సుల కొరత 8 |
2,481,083 | పోలీస్, రవాణా శాఖలదే నిర్లక్ష్యం | • డ్రంకెన్ డ్రైౖవ్ కేసులలో వారిదే బాధ్యత, • సామాజిక కార్యకర్త రమణ్జిత్ సింగ్ పంజాగుట్ట, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్న డ్రంకెన్ డ్రైవర్ల విషయంలో పోలీస్, రవాణా శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, మోటార్ వెహికిల్ యాక్ట్ను సక్రమంగా అమలు చేయడం లే... |
2,481,084 | మీ పర్సు మా దగ్గరుంది! | • పోగొట్టుకున్న వారు రావాలంటున్న సుల్తాన్బజార్ పోలీసులుమంగళ్హాట్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): మీ పర్సు పోయిందా..? అయితే వెంటనే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్కు రండి అంటున్నారు పోలీసులు. కోఠిలో పర్సు పోగొట్టుకున్న వారు కంగారు పడాల్సిన పనిలేదన్నారు. విలువైన బంగారంతో పాటు నగదు ఉన్న పర్సు మా దగ్గరుందన్నారు. అయినా పర్సు ఎ... |
2,481,085 | అంబేడ్కర్ వర్సిటీలో ఫైన్ఆర్ట్స్ వర్సిటీకి భూ కేటాయింపు | • పదెకరాలను ఖరారు చేయాలని ఆదేశంహైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్లోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి (జేఎన్ఎఫ్ఏయూ) కేటాయించాలంటూ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ మేర ... |
2,481,082 | మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగా గుర్తించడానికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడానికి ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, ఏఐజీ ఆస్పత్రిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ను ప్రారంభించింది. ఏషియన్ మెడికల్ ఫౌండేషన్, యుసి బ్రెస్ట్ ఫౌండేషన్, ఏఐజి ఆస్పత్రుల భాగస్వామ్యం... |
2,480,963 | పచ్చనిచెట్లపై మున్సిపల్ గొడ్డలి వేటు | నార్సింగ్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): మణికొండ మున్సిపాలిటీ షేక్పేట్, కోకాపేట్ రేడియల్ రోడ్డులో బీఆర్సీ వద్ద ట్రాఫిక్కు అంతరాయంగా ఉన్నాయంటూ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న రెండు భారీ చింతచెట్లను మున్సిపల్ సిబ్బంది మంగళవారం నరికేశారు. సాధారణంగా వృక్షాలు అడ్డువస్తే వాటికి ఐల్యాండ్ నిర్మించి ఆ పక్కన ఉన్న స్థలం నుంచి రోడ్లు వేస్తా... |
2,480,964 | ‘బీసీ కార్పొరేషన్ చైర్మన్’లకు సత్కారం | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): బహుజనుల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమనడానికి రేవంత్ ప్రభుత్వం వివిధ పదవులు, నియామకాల్లో బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యమే నిదర్శనమని వక్తలు కొనియాడారు. గత ప్రభుత్వం బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, వారికి దక్కాల్సిన నిధుల కేటాయింపులోనూ అన్యాయం చేసిందని తెలంగాణ బీసీ ఫెడరేష... |
2,480,965 | చింతకుంట పార్కులో విరిగిపడ్డ చెట్లకొమ్మలు | రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): అత్తాపూర్ డివిజన్ కాంతారెడ్డినగర్కాలనీ సమీపంలోని చింతకుంట జీహెచ్ఎంసీ పార్కులో శనివారం కురిసిన వర్షానికి చెట్లకొమ్మలు విరిగి వాకింగ్ ట్రాక్పై పడ్డాయి. రెండున్నర నుంచి మూడెకరాల్లో ఉన్న చింతకుంట పార్కులో అనేక మంది వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. విరిగిపడ్డ చెట్ల కొమ్మలను తొలగించాలన... |
2,480,966 | శాస్త్రీయ సంగీతం, లలిత కళలు సంస్కృతికి నిదర్శనం | రవీంద్రభారతి, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): శాస్త్రీయ సంగీతం, నృత్యరీతులు, లలితకళలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ సహకారంతో నవ్యనాటక సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 49వ అఖిలభారత సంగీతం, నృత్య పోటీలు మంగళవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన కళ... |
2,480,967 | కొమండూరి రామాచారికి కిన్నెర–బాలు పురస్కారం ప్రదానం | రవీంద్రభారతి, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెచ్చిన గాయకుడు రామాచారి అని రిటైర్డ్ ఐఏఎస్ డా.కేవీ రమణాచారి అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలు వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కిన్నెర–బాలు పురస్కారాన్ని ప్రముఖ గాయకుడు రామాచారికి ప్రదానం... |
2,480,968 | ఫలక్నుమా పాత రైల్వేఓవర్ బ్రిడ్జికి పగుళ్లు | • పరిశీలించిన అధికారులు చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఫలక్నుమా పాత రైల్వే ఓవర్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి పగుళ్లు ఏర్పడ్డాయి. జోనల్ కమిషనర్ టి.వెంకన్నతో పాటు ట్రాఫిక్ అధికారులు మంగళవారం పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జి పై నుంచి బస్సులు, ఇతర భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఛత్రినాక చౌరస్తా, లాల... |
2,480,969 | తిరుమల లడ్డూ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి : వీహెచ్ | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడడం దౌర్భాగ్యమని, సీబీఐ విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. హిమాయత్నగర్లోని టీటీడీ వేంకటేశ్వరస్వామిని ఆయన మంగళవారం దర్శించుకున్నారు. అక్కడే దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన... |
2,480,951 | విద్యార్థులు సామాజిక సేవ చేయాలి | మదీన, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవపై కూడా ఆసక్తి కనబరచాలని హుసేనిఆలం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పియ చిన్నమ్మ అన్నారు. మంగళవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు స్పై కెమెరా, ట్రాఫిక్ నిబంధనలు, బాలికా శిశువు సంరక్షణ తదితర అంశాలప... |
2,480,952 | పైప్లైన్ పనులను వేగవంతం చేయండి | కార్వాన్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): టోలిచౌకి రుమాన్ హోటల్ ప్రాంతంలో ఎన్పీ–2 పైప్లైన్ మరమ్మతులకు గురైంది. విషయం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే మహ్మద్ కౌసర్ మొహియుద్దీన్ మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్పీ–2 పైప్లైన్ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా... |
2,480,953 | వ్యవసాయ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే | రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ఎన్ఎస్ఎస్ డే నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగించవద్దని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో... |
2,480,954 | తాజ్మహల్ హోటల్ భోజనంలో జెర్రి! | మంగళ్హాట్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఆబిడ్స్ తాజ్మహల్ హోటల్లో భోజనం చేస్తోన్న ఓ వినియోగదారుడి ప్లేట్లో జెర్రి ప్రత్యక్షమైంది. అశోక్కుమార్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఆ హోటల్లో అన్నం తింటుండగా పప్పులో జెర్రి కనిపించడంతో ఆందోళనకు గురై విషయాన్ని హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. పాలకూరలో జెర్రి వచ్చినట్టుంది..... |
2,480,955 | విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం అందజేత | చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు బండ్లగూడ మండల స్థాయి ఆటల పోటీలు శంషీర్గంజ్లోని శారద విద్యాలయ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభం కానున్నాయి. పోటీలో పాల్గొనే విద్యార్థులకు ఫిజికల్ డైరెక్టర్ వి.శ్రీనునాయక్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ యూనిఫాం అందజే... |
2,480,956 | ఐఐఆర్ఆర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ | రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్లోని జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఐఐఆర్ఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సునీత కోట ఆధ్వర్యంలో సంస్థ ఆవరణలో ఉద్యోగులు మంగళవారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, హరిహర క్షేత్రం ఆవరణను శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని... |
2,480,957 | బాలికకు లైంగిక వేధింపులు | • సైబర్ నేరగాడి అరెస్టుహైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): బాలికను లైంగికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని అరెస్టు చేశారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్కట్టకు చెందిన అఖిల్ అనే యువకుడు స్నాప్చాట్లో బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలిక అమాయకత్వాన్ని... |
2,480,958 | సీసీ రోడ్డు పనులు ప్రారంభం | నార్సింగ్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): నార్సింగ్ మున్సిపాలిటీ 6వ వార్డు వెస్ట్రన్ మెడోస్ టౌన్షిప్లో సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ పత్తి శ్రీకాంత్రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రజలు ఎల... |
2,480,950 | హాస్టల్ కేర్టేకర్పై కేసు నమోదు | రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): చెరీస్ హాస్టల్ కేర్ టేకర్ సునీతపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం స్టేషన్ బెయిల్ ఇచ్చారు. హాస్టల్ కేర్టేకర్ కొడుతున్నదని, తాము హాస్టల్కు వెళ్లమని 16 మంది విద్యార్థినులు గత శుక్రవారం రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రంగారెడ్డి జిల... |
This dataset contains Telugu news articles with their corresponding headlines. It is intended for use in natural language processing tasks such as text classification, summarization, and machine translation.
The data was collected from Androjyothi paper and Eenadu paper.
The dataset is provided in data/. Each row represents story_id, news article and headline.
This dataset is separated according to the news paper's publication date. From September 25 to December 25, 2024, is the Train set, and from December 26 to January 9, 2025, is the Test set.
If you use this dataset please site it using following citation.
@misc{telugu_news_dataset,
author = {saidineshpola},
title = {Telugu News Dataset},
year = {2024},
publisher = {Huggingface},
howpublished = {\url{https://huggingface.co/datasets/saidines12/telugu_news_dataset}},
}